శ్రియ సీక్రెట్ జర్నీ...
ఎప్పుడూ వర్క్ షెడ్యూల్స్ అంటే ఎవరికైనా బోరే. అందుకే ఏమాత్రం తీరిక దొరికినా నచ్చిన ప్రదేశాలకు వెళ్లి సేదతీరడం నటీనటులకు రివాజు. గత రెండుమూడేళ్లుగా తీరికలేని షెడ్యూల్స్ తో బిజీగా ఉంటూ వచ్చిన అందాల నటి శ్రియ ఈమధ్యన కాస్తంత తీరిక దొరగ్గానే సీక్రెట్ గా హిమాలయాలను పర్యటించి తిరిగి వచ్చిందట. హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించాలని కోరుకోని వారెవరూ ఉండరు. అయితే అందరికీ అది సాధ్యమయ్యే పని కూడా కాదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం రెగ్యులర్ గా హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. తన కొత్త సినిమా ప్రారంభంలో కానీ, సినిమా పూర్తయిన తర్వాత గానీ ఆయన ఓ నెలరోజుల పాటు హిమాలయాలకు వెళ్లి రుషికేష్, బ్రదీనాథ్ లను సందర్శించి వస్తుంటారు. శ్రియ హిమాలయాలకు వెళ్లాలని అనుకోవడానికి రజనీకాంత్ స్ఫూర్తి కూడా ఉందట.
'శివాజీ' చిత్రంలో రజనీకాంత్ తో కలిసి నటించిన సమయంలో 'జర్నీ టు హిమాలయాస్' గురించి ఆయన వివరించారట. అప్పట్నించే తాను కూడా యాత్ర చేయాలనే ఆలోచనతో శ్రియ ఉందట. అయితే ఆ చిత్రం తర్వాత ఓ హాలీవుడ్ చిత్రం, విక్రమ్ తో 'మల్లన్న', విశాల్ తో 'పిస్తా' చిత్రాల బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఆమె కోరిక తీరలేదు. ఇప్పుడు తీరిక దొరకడంతో సీక్రెట్ గా హిమాలయాలకు వెళ్లి తన కోరిక తీర్చుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
Be first to comment on this News / Article!
|