డాక్టర్ కమలిని
బెంగాల్ బ్యూటీ కమలిని ముఖర్జీకి డాక్టరేట్ ఎప్పుడొచ్చింది? ఏ యూనివర్శిటీ ఇచ్చిందని అనుకుంటున్నారా? నిజానికి అలాంటిదేమీ లేదు కానీ...డాక్టర్ పాత్రల్లో కమిలిని ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టింది. 'డాక్టర్ కమిలిని' అని ముద్దుగా అందిరితో పిలిపించుకుంటోంది.
కమిలిని ముఖర్జీ తొలి చిత్రమే ఎయిడ్స్ కంథాంశంతో హిందీలో రూపొందిన 'ఫిర్ మిలేంగే' కావడం విశేషం. ఆ చిత్రం సరైన గుర్తింపు ఇవ్వకపోయినా ఐదేళ్ల క్రితం శేఖర్ కమ్ముల 'ఆనంద్' చిత్రంతో ఒక్కసారిగా కమిలిని పేరు మారుమోగింది. సావిత్రి తరహా నటి తెలుగుతెరకు దొరికిందంటూ కమలిని ప్రశంసలు అందుకుంది. అదే చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 'మీనాక్షి', 'స్టైల్ ', 'గోదావరి', 'క్లాస్ మేట్స్', 'హ్యాపీ డేస్', 'పెళ్లయింది కానీ', 'జల్సా' వంటి చిత్రాల్లో నటిగా తనదైన ముద్ర వేసుకుంది. 'గమ్యం' చిత్రం మళ్లీ కమలినికి మరో మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టింది. అందులో ఆదర్శభావాలున్న డాక్టర్ గా కమిలిని నటించింది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉన్న 'గోపి గోపిక గోదావరి' చిత్రంలోనూ ఆమె మరోసారి డాక్టర్ పాత్రలో కనిపించబోతోంది. గోదావరిలోని ఓ మొబైల్ క్లినిక్ లో ఆమె వైద్యసేవలు అందించే పాత్రలో నటించింది. ఆసక్తికరంగా క్నడంలో ఇటీవల కమలిని నటించిన 'సవారి' చిత్రంలోనూ ఆమె డాక్టర్ జానకి పాత్రలో నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇలా డాక్టర్ గా కమిలిని హ్యాట్రిక్ కొట్టేసేంది.
Be first to comment on this News / Article!
|