ఇలియానా కాకుంటే జూ.ఐష్!
యూత్ లో ఇలియానాకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని 'కిక్' సకెస్స్ నిరూపించింది. 'జల్సా', 'భలేదొంగలు' తర్వాత ఇలియనా కొద్ది గ్యాప్ తీసుకుంది. ఈలోపు అనుష్కకు 'అరుంధతి'తో స్టార్ ఇమేజ్ బలపడింది. నయనతార, త్రిష వంటి హీరోయిన్ల పోటీ ఉండనే ఉంది. అయితే ఈ పోటీని కూడా తట్టుకుని ఇలియానా ఇప్పుడు సక్సెస్ 'కిక్'తో మరింత బిజీ అయింది. ఇదే సమయంలో తమిళం నుంచి మంచి ఆఫర్లు వస్తున్నా అటువైపు వెళ్లేందుకు ఇలియానా షరామామూలుగా మీనమేషాలు లెక్కపెడుతోంది.
తమిళ హీరో శింబు ఎప్పటికప్పుడు తన సినిమాల్లో క్రేజీ హీరోయిన్లను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేకత కనబరుస్తుంటారు. శింబు చూపు ఇప్పుడు ఇలియానాపై కూడా పడిందట. నిజానికి ఇలియానా తొలి రోజుల్లో తమిళంలో రవికృష్ణ సరసన 'కేడి' చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇలియానా మళ్లీ అటువైపు తొంగిచూడలేదు. ప్రస్తుతం తెలుగులో ఆమెకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ తమిళం వైపు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శింబు తదుపరి చిత్రమైన 'వాలిబన్' కోసం ఆ చిత్ర నిర్మాత చక్రవర్తి ఇలియానాతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఇలియానా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలియానా కాదంటే ఐశ్వర్యారాయ్ పోలికలతో తెలుగులో ప్రస్తుతం బిజీగా ఉన్న స్నేహ ఉల్లాల్ ('కరెంట్' ఫేమ్) పేరు కూడా రిజర్వ్ చేసి ఉంచుకున్నారట. మరో ఛాయిస్ గా అనుష్కనూ అనుకుంటున్నారు.
Be first to comment on this News / Article!
|