అందుకే నిర్మాతనయ్యా: శివాజీ
'కెరీర్ పరంగా మంచి హిట్స్ ఉన్నా ఇటీవల కాలంలో ఆశాజనకమైన సక్సెస్ లు లేవు. హీరోగా పోటీలో నిలబడాలనే తపనతోనే నిర్మాతగా మారాను' అని యువ హీరో శివాజీ తెలిపారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అనే సొంత బ్యానర్ పై ఆయన నిర్మాతగా మారి కన్నడంలో విజయం సాధించిన 'తాజ్ మహల్' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. శివాజీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ నూతన కథానాయిక నటిస్తోంది. అరుణ్ సింగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణా ఏడెకరాలలో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మంగళవారమే శివాజీ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయనతో షూటింగ్ స్పాట్ లో జరిపిన ఇంటర్వ్యూ ఇలా సాగింది...
?నిర్మాతగా మారడానికి కారణం
- కోట్లు సంపాదించాలని మాత్రం కాదు. ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లు దొరకలేదు. దీనికి ప్రమోషన్ లోపం కూడా ఉంది. ఈ క్రమంలోనే హీరోగా పోటీలో నిలబడాలనే తపన మొదలైంది. నిర్మాతగా మారాలనుకున్నాను. 'తాజ్ మహల్' చిత్రం కన్నడంలో 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. అక్కడ సినిమా 200 రోజులు ఆడింది. తెలుగులో దానికి ఏ మాత్రం తగ్గకుండా నిర్మాణం చేస్తున్నాం. అదే బయట నిర్మాతలైతే అంత బడ్జెట్ తో రిస్క్ తీసుకోరు. నిర్మాతగా మారడానకి ఇది మరో ప్రధాన కారణం.
?ప్రమోషన్ లోపం గురించి మరింత వివరించండి
-'పెళ్లికాని ప్రసాద్', 'డైరీ', 'ఇందుమతి', 'మా ఆయన చంటిపిల్లాడు', 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్'...వంటివి మంచి చిత్రాలు అనిపించుకున్నాయి. పబ్లిసిటీ పరంగా సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆ సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. కొత్త నిర్మాతలు కొందరు రిస్క్ లేకుండా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. దీంతో సినిమా విడుదల దగ్గర పడేసరికి పబ్లిసిటీ కోసం డబ్బు వెచ్చించడం లేదు. దీంతో సినిమా గురించి ఎవరికీ తెలియడం లేదు. నిజానికి మంచి సినిమాకి తగినంత పబ్లిసిటీ తోడైతే చక్కటి విజయం సాధించడం ఖాయం. అలాగే సకాలంలో విడుదల కాకపోవడం, సినిమాలపై సినిమాలు పడటం వంటి కారణాలు ఇటీవల నా సినిమాల విషయంలో జరిగింది. ఇందుకు ఎవరినీ నిందించడం లేదు. నా అదృష్టం అంతేనని సరిపెట్టుకుంటున్నాను.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|