మీరా ప్రేమ బెడిసికొట్టిందా?
వెండితెరపై ఎంతటి సెలబ్రెటీలైనప్పటికీ ప్రేమ, పెళ్లి వదంతులు వారిని కూడా వదిలిపెట్టవు. జాతీయ ఉత్తమ నటి మీరాజాస్మిన్ ప్రేమలో పడిందంటూ ఎప్పటికప్పుడు పలు వదంతులు రావడం, వాటిని ఆమె ఖండించడం దాదాపు ఏడాది నుంచి సర్వసాధారమైంది. ఇప్పుడో రేపే మీరా జాస్మిన్ సినిమాలకు స్వస్తి చెప్పనుందందనే వార్తలు రావడం, ఇందుకు భిన్నంగా మీరా కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడం జరుగుతూనే ఉంది. కొద్దికాలంగా మీరాజాస్మిన్, మాండలిన్ యు.రాజేష్ ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. మాండలిన్ శ్రీనివాస్ తమ్ముడే మాండలిన్ రాజేష్. మ్యూజిక్ కంపోజర్ అయిన రాజేష్, మీరా కొద్దికాలంగా చెన్నైలో కలిసే ఉంటున్నప్పటికీ పెళ్లికి మాత్రం ఇంకా సమయాత్తం కాలేదు. అయితే ఈ శుభ ఘడియ రాకముందే వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది.
రాజేష్ కంటే ముందుగానే తమిళ హీరో ప్రశాంత్, మీరా ప్రేమించుకున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రశాంత్ ఇటీవల తన భార్య గృహలక్ష్మితో విడాకులు తీసుకోవడం కూడా ఆ వదంతులకు బలం చేకూరినట్టయింది. అయితే ఆ వదంతులను ప్రశాంత్ ఖండించారు. అయినప్పటికీ రాజేష్ తల్లిదండ్రులు మాత్రం మీరాను పెళ్లాడాలనుకున్న రాజేష్ కోరిక పట్ల సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే మీరా-రాజేష్ లు ప్రేమ వ్యవహారానికి కూడా ఇప్పుడు తెరపడిందంటూ చెన్నై వర్గాలు చెబుతున్నాయి. రాజేష్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారని వారు చెబుతున్నారు. 'కాలమే అన్ని గాయలనూ మాన్పుతుంది. నేను ఎంతో ఊహించుకున్నాను. వాటికీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకూ ఏమాత్రం పొంతన లేదు. కాలమే అన్నిటికీ సమాధానమిస్తుంది' అని రాజేష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇంతకుమించు తాను ఏమీ చెప్పదలచుకోలేదనీ, ప్రస్తుతం తన దృష్టంతా మ్యూడిక్ కెరీర్ మీదే కేంద్రీకరించబోతున్నాననీ రాజేష్ చెబుతున్నారు. మీరా సైతం ప్రస్తుతం తన కెరీర్ పైనే ఎక్కువ దృష్టి సారించాలని నిశ్చయించుకుందని అంటున్నారు. కొత్త హీరోలతో పనిచేసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తూ వరుసగా పలు తమిళ, మలయాళ చిత్రాలకు కమిట్ అవుతోంది.
Be first to comment on this News / Article!
|