రొమాంటిక్'ఊహాచిత్రం'10న
వంశీకృష్ణ, కావేరీ ఝా ('నగరం' ఫేమ్) జంటగా సిటీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ 'ఊహాచిత్రం'. లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ పెదవీర్రాజు సమర్పణలో కె.పైడిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యకి దర్శకుడు. ఈనెల 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
కొత్తతరహా చిత్రాలకు ఇటీవల కాలంలో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు తెరకెక్కించారనీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ , సెన్సార్ వంటి కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయనీ చిత్ర సమర్పకుడు పెదవీర్రాజు తెలిపారు. నిర్మాత పైడిబాబు మాట్లాడుతూ, సిటీ నేపథ్యంలో చక్కటి రొమాంటిగ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఇటు యూత్ నూ, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని చెప్పారు. రొమాంటిక్ థ్రిల్లర్ అయినప్పటికీ లవ్, ఫ్యామిలీ వంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయన్నారు. ఇవాల్టి ట్రెండ్ గా అనుగుణమైన స్క్రిప్టు, దానిని దర్శకుడు తెరకెక్కించిన తీరు మెచ్చుకోలుగా ఉంటుందని చెప్పారు. వి.ఎన్.సురేష్ కుమార్ ఫోటోగ్రఫీ, శివ మ్యూజిక్, రీరికార్డింగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. హీరో గా వంశీకృష్ణకు ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న ఆర్టిస్టులా డాన్స్ లు, ఫైట్స్ చేశారనీ, కావేరీ ఝా గ్లామర్ తో పాటు నటనకు అవకాశమున్న పాత్రలో నటించి హండ్రెస్ పర్సంట్ న్యాయం చేసిందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జీవా, సూర్య, బబ్లు, శ్రీధర్, విజయ్, సుధీర్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటించారు. సురేంద్ర కృష్ణ మాటలు, రమేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|