జగపతికి ఆమె కావాలట
హ్యాండ్ సమ్ హీరోలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. హీరో జగపతిబాబు ఎన్ని మాస్ రోల్స్ పోషించినా ఆయనకు ఫ్యామిలీ కథాంశాలతో వచ్చిన చిత్రాలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. 'శుభలగ్నం', 'పెళ్లయిన కొత్తలో' వంటి పలు చిత్రాలు ఆ కోవలేకే వస్తాయి. జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరి మధ్యా ఏదో ఉందనే ఊహాగానాలు అప్పట్లో బలంగా వినిపించిన సందర్భాలూ ఉన్నాయి. సౌందర్య హఠాన్మరణంతో మిడిల్ ఏజ్డ్ హీరోలకు సరైన జోడీ దొరకడమూ కష్టమైంది. త్రిష, నయనతార వంటి హీరోయిన్లు కొద్దిగా సీనియర్ హీరోలతో సైతం నటిస్తూ ఆ కొరత కొంతవరకైనా తీరుస్తున్నారు. జగపతిబాబు కూడా ఇప్పుడు త్రిషతో నటించాలనుందనే తన కోరికను బయటపెట్టారు. త్రిష చాలా అందమైన అమ్మాయనీ, ఏదో ఒక రోజు ఆమెతో నటించాలని కోరుకుంటున్నాననీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తమ మనోగతాన్ని వెల్లడించారు.
సహజంగా యువతరం హీరోయిన్లంతా వీలుచిక్కినప్పుడల్లా తాము నటించాలనుకుంటున్న హీరోల లిస్ట్ ఏకరవు పెడుతుంటారు. జగపతిబాబు ఇంత ఓపెన్ గా త్రిషతో నటించాలనే కోరికను బయటపెట్టడం వెనుక ఆయనను అర్ధం చేసుకునే అనుకూలవతి అయిన భార్య ఉండటమే కారణమట. ఆ విషయంలో జగపతిబాబు అదృష్టవంతుడే మరి...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|