పెళ్లి పీటలపై అర్చన?
పదహారణాల తెలుగుమ్మాయి లయ ఆమధ్యన పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. మరో తెలుగమ్మాయి వేద అలియాస్ అర్చన కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలనుకుంటోందని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ల పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఈమధ్యనే మంజుల-విజయ్ కుమార్ దంపతుల కుమార్తె శ్రీదేవి వివాహం చేసుకుంది. మీనా ఈనెల 12న పెళ్లి చేసుకోనుంది.
అర్చన కెరీర్ తొలినాళ్లలో హోమ్లీ తరహా పాత్రల్లో నటించింది. అయితే సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇటీవల కాలంలో ఆమెకు పెద్ద బ్యానర్ అవకాశాలు లేకపోవడంతో చిన్న నిర్మాతల చిత్రాల్లో నటిస్తోంది. ఈమధ్యనే గ్లామర్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ పలు ఆఫర్లు దక్కించుకుంటున్నా సక్సెస్ కొరత మాత్రం ఆమెను వెన్నాడుతూనే ఉంది. గ్లామర్ తో కూడిన యాక్షన్ పాత్రలో 'బ్యాంక్' చిత్రంలో నటించింది.
ఆ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రస్తుతం ఆమె సోలోగా 'సివంగి' చిత్రంలో నటిస్తోంది. సినీ కెరీర్ సంతృప్తిగా లేకపోవడం, అడపాదడపా వస్తున్న గాసిప్స్ తో విసుగెత్తిన అర్చన తన తల్లిందడ్రులు చేసిన పెళ్లి ప్రతిపాదనకు సుముఖంగా స్పందించిందట. పెద్దలు కుదిర్చిన ఓ బిజినెస్ మన్ ను అర్చన పెళ్లి చేసుకోనుందనీ, ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందనీ అర్చన సన్నిహితుల ద్వారా తెలిసింది.
Be first to comment on this News / Article!
|