మగధీర స్టోరీ ఇదేనట...
కొన్ని చిత్రాలు షూటింగ్ చివరి దశకు వచ్చాక క్రేజ్ మొదలవుతుంది. మరికొన్ని చిత్రాలు సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచీ రోజురోజుకూ క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంటాయి. 'మగధీర' రెండో కోవలోకి వస్తుంది. రామ్ చరణ్, కాజల్ తొలి కాంబినేషన్ లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలవుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇంతవరకూ ప్రేమకథా చిత్రాలు తీయకుండానే వరుస సక్సెస్ లు సొంతం చేసుకున్న రాజమౌళి తొలిసారిగా ఈ చిత్రాన్ని ప్రేమకథా ఇతివృత్తంతో, అందులోనూ పునర్జన్మల కథాంశంతో రూపొందిస్తుండటం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రం కథాగమనం 400 ఏళ్ల క్రితం నుంచి ప్రస్తుతం కాలంవరకూ జరుగుతుంది. రామ్ చరణ్, కాజల్ తో పాటు రియల్ స్టార్ శ్రీహరి సైతం ఇందులో చెరో రెండు పాత్రలు (ద్విపాత్రాభినయం) పోషిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ దర్శకత్వంలో రూపొందిన భారీ సెట్టింగ్ లు అలనాటి రాచరికపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పబ్లిసిటీ పోస్టర్లలో కనిపిస్తుండటం, గ్రీకువీరుడు తరహాలో రామ్ చరణ్ గెటప్ ఇప్పటికే 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ' అవుతున్నాయి. పునర్జన్మల కథాంశాలతో విజయవంతమైన 'మూగ మనసులు', 'జానకిరాముడు', హిందీ 'కర్జ్', 'ఓం శాంతి ఓం' తరహాలోనే ఈ సినిమా లైన్ కూడా ఉంటుందని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నారు. చిరంజీవి 'వేట', ఎన్టీఆర్-రాజమౌళిల 'యమదొంగ' మిక్స్ చేస్తే 'మగధీర' అవుతుందనే ప్రచారమూ జరుగుతోంది. ఆసక్తికరంగా ఈ చిత్రం స్టోరీలైన్ పై కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|