ప్రియమణి 'తూటా' 17న
ప్రియమణికి ఉన్న గ్లామర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తమిళంలో వచ్చిన 'తూటా' అనే చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జీవన్, ప్రియమణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని వాసిరెడ్డి పద్మాకరరావు, బి.నాగరాజు సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెల్వ దర్శకుడు. ఈనెల 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
బాగా చదివి గొప్పవాడు కావాలనుకునే ఓ యువకుడు దూరమైన తండ్రిని వెతుక్కుంటూ తల్లితో సహా సిటీకి వస్తాడు. అక్కడ తండ్రి మరో భార్యతో ఉండటం చూసి గొడవ పడతాడు. ఈ గొడవల్లో తల్లిని పోగొట్టుకుని అతను ఒంటరివాడవుతాడు. అవినీతి పోలీసుల చేతిలో 'తూటా' అవుతాడు. ఆ క్రమంలో అతని జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. అతని జీవితంలో ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. ఆ విశేషాలను తెరమీద చూడాల్సిందేనని నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు మేళవించిన చిత్రమిదనీ, పోలీస్ ఇన్ స్పెక్టర్ గా ప్రియమణి నటించిందనీ, ఆమె గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందనీ వారు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, సంపత్ కుమార్, లివింగ్ స్టన్, మల్లిక, దాము, రాజ్ కపూర్ తదితరులు నటించారు. ఎం.రాజశేఖర్ రెడ్డి మాటలు, పి.ఎస్.రమణ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|