శ్రీహరి 'సామ్రాజ్యం' 10న
శ్రీహరి, సుమన్, సమీక్ష ప్రధాన పాత్రల్లో సిద్ధి వినాయక ఫిలిమ్స్ పతాకంపై ముత్యాల ఆంజనేయులు నిర్మించిన చిత్రం 'సామ్రాజ్యం'. వీరు ద్వైత్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 10న విడుదల చేస్తున్నట్టు హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో చిత్ర నిర్మాత సోమవారంనాడు తెలియజేశారు.
హీరో శ్రీహరి మాట్లాడుతూ, ఫ్యాక్షన్ లో కొత్త పాయింట్ తో ఈ చిత్రం రూపొందిందనీ, ఫ్యాక్షన్ లో ఈ యాంగిల్ కూడా ఉంటుందా అని ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందనీ చెప్పారు. సుమన్, తానూ అన్నదమ్ములుగా నటించామనీ, అలాగే నిషా కొఠారీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటుందనీ చెప్పారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చాలా బాగా వచ్చిందనీ తెలిపారు. ఇది ఫ్యాక్షన్ కథాచిత్రమైనప్పటికీ లవ్ తో పాటు కామెడీ ట్రాక్ కూడా ఉంటుందని సుమన్ తెలిపారు. ఇంతవరకూ వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలలో స్పృశించని అంశాలు ఇందులో దర్శకుడు చక్కగా ఆవిష్కరించారని అన్నారు. ఈ చిత్రంలో కొంత షూటింగ్ అవుట్ డోర్ లో చేద్దామనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించలేదనీ, విపరీతమైన వర్షాల కారణంగా షెడ్యూల్స్ ను రద్దుచేసి ఆ తర్వాత ప్రత్యేకంగా సెట్స్ వేసి తీయడంతో బడ్జెట్ కూడా పెరిగిందనీ చెప్పారు. అయితే నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని పూర్తి చేశారని అన్నారు. శ్రీహరితో తన కాంబినేషన్ కు మంచి పేరు వస్తుందని అన్నారు. ఈ చిత్రానికి టి.రాజేంద్ర సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|