11న 'వ్యాపారి' ఆగమనం
'ఖుషి', 'కొమురం పులి' చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య కథానాయకుడుగా, తమన్నా, నమిత, మాళవిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వ్యాపారి'. శక్తి చిదంబరం దర్శకుడు. తమిళంలో 'వ్యాబారి'గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో 'వ్యాపారి'గా అనువాదమవుతోంది. ప్రణతి క్రియేషన్స్ పతాకంపై కూనిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 11న ఆంధ్రదేశమంతటా విడుదల చేస్తున్నట్టు కూనిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
దక్షిణాది సినిమాల్లో ఇంతవరకూ టచ్ చేయని క్లోనింగ్ పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని ఆయన చెప్పారు. క్లోనింగ్ ద్వారా జంతువులను సృష్టించడం మనకు తెలుసనీ, అయితే ఈ చిత్రంలో క్లోనింగ్ ద్వారా మనిషిని సృష్టిస్తే అతను ఎలాంటి అద్భుతాలు చేశాడనే అంశాన్ని దర్శకుడు శక్తి చిదంబరం ఆసక్తికరంగా తెరకెక్కించారనీ చెప్పారు. తమన్నా నటనతో పాటు గ్లామరస్ గా కూడా కొత్తగా కనిపిస్తుందనీ, నమిత, మాళవిక అందాలు కుర్రకారుని హుషారెక్కిస్తాయనీ పేర్కొన్నారు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ అవుతాడనీ, ఇటీవల విడుదలైన ఆడియోకి కూడా మంచి స్పందన వస్తోందనీ చెప్పారు. అలాగే రీరికార్డింగ్ కూడా బాగా కుదిరిందన్నారు. ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|