'ఆంజనేయులు' ఆగస్టు 12న
ఈ ఏడాది ఇంతవరకూ రెండే పెద్ద హిట్లు పరిశ్రమను వరించాయి. సంక్రాంతి హిట్ గా 'అరుంధతి', సమ్మర్ హిట్ గా 'కిక్' బాక్సాఫీస్ కలెక్షన్లను దండుకున్నాయి. 'నేనింతే', 'బలాదూర్' చిత్రాల ఫెయిల్యూర్స్ తరువాత రవితేజకు 'కిక్' మళ్లీ సరైన బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రవితేజ ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. 'ఆంజనేయులు' చిత్రంతో ఆయన మరోసారి పూర్తి వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్ బాబు సమర్పణలో నటుడు గణేష్ బాబు తొలిసారిగా నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకుడు. దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కూ, ఆయన సహజనటనకు తగ్గట్టుగా ఈ చిత్రం రూపొందుతోందనీ, ఆయన కెరీర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనీ గణేష్ బాబు చెబుతున్నారు. ఇందులో రవితేజ హెచ్ఎం టీవీ జర్నలిస్టుగా నటిస్తుండగా, అతని జంటగా నయనతార నటిస్తోంది. అమ్ స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రేలియాలో రెండు పాటల చిత్రీకరణ కూడా లావిష్ గా జరిపారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావస్తుండటం విశేషం. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజారవీంద్ర, ఆలీ, ఎంఎస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పరశురామ్ అందిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 21న ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|