ఎన్టీఆర్ తో మళ్లీ సమీరా?
ఎన్టీఆర్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'అదుర్స్' చిత్రం ప్రోగ్రస్ లో ఉండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సెట్స్ పైకి రాబోతున్నాయి. ఆసక్తికరంగా ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రంలో మరోసారి నటి సమీరా రెడ్డిని తీసుకోవాల్సిందిగా నిర్మాతకు సిఫారసు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో తాజా చర్చ జరుగుతోంది.
నరసింహుడు', 'అశోక్' చిత్రాల్లో ఎన్టీఆర్, సమీరారాడెడ్డి గతంలో కలిసి నటించారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినవే. ఈ చిత్రాల నిర్మాణ సమయంలోనే సమీరారెడ్డికి ఎన్టీఆర్ దగ్గరయ్యారనీ, ఇద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోందనీ అప్పట్లో బలమైన ప్రచారం జరిగింది. సమీరా కోసం పట్టుబడుతూ ఎన్టీఆర్ తన కెరీర్ ను కూడా లక్ష్యపెట్టడం లేదనే ఊహాగానాలూ వినిపించాయి. ఆ తర్వాత క్రమంలో సమీరా బాలీవుడ్ బాట పట్టడంతో ఆ వదంతులకూ తెరపడ్డాయి. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సమీరా ఇప్పుడు మరోసారి దక్షిణాది చిత్రాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈమధ్యనే సూర్యతో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రంలో నటించిన సమీరా టాలీవుడ్ లో సైతం మరికొన్ని ఆఫర్ల కోసం ఇటీవల ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఈ క్రమంలో ఎన్టీఆర్ మరోసారి ఆమెకు స్నేహహస్తం అందించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సమీరా పేరును అశ్వనీదత్ కు సిఫారసు చేశారనీ, ఇప్పటికే ఇలియానా ప్రధాన హీరోయిన్ గా ఎంపిక కాగా, సమీరా మరో హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదనీ చెబుతున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ కు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను హ్యాండిల్ చేసే అలవాటు ఎలాగూ ఉంది కాబట్టి సమీరాకు ఓ బెర్త్ (ఆఫర్) ఇవ్వడం కష్టం కాకపోవచ్చు. ఎటొచ్చీ సమీరా రీఎంట్రీతో ఎన్టీఆర్-సమీరా జంట మరోసారి వార్తల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మరి..
Be first to comment on this News / Article!
|