దిల్ రాజుపై చాంబర్ వేటు?
డైనమిక్ ప్రొడ్యూసర్ గా పేరున్న దిల్ రాజుపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గుర్రుగా ఉందనీ, ఆయనపై నిషేధాస్త్రం (సహాయ నిరాకరణ) ప్రయోగించాలనుకుంటోందనీ విశ్వసనీయ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దిల్ రాజు తన తాజా చిత్రమైన 'జోష్' విషయంలో ఛాంబర్ నిబంధనలను అతిక్రమించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
సినిమాల పబ్లిసిటీకి సంబంధించి ప్రమో రేట్ల విషయంలో జెమీనీ, ఈటీవీ వంటి ఛానెల్స్ కు సహకరించరాదటూ ఛాంబర్ ఇటీవల నిర్ణయించింది. మాటీవీ, జెమినీ టీవీలు ప్రసారం చేసే ఆడియో ఫంక్షన్లు, ప్రమోషన్లను ఇతర న్యూస్ ఛానెల్స్ లో ప్రమోట్ చేయరాదనే నిబంధన కూడా ఛాంబర్ విధించిందట. అయితే దిల్ రాజు 'జోష్' చిత్రం ఆడియో ఫంక్షన్ లైవ్ ను మాటీవీకి ఇవ్వడంతో పాటు ఆ ఫంక్షన్ విజువర్స్ ఇతర న్యూస్ ఛానెల్స్ కూడా ఇచ్చారు. అలాగే ప్రమోలు కూడా ఈ ఛానెల్స్ కు ఇవ్వడం జరిగింది. ఇది నిబంధనలను అతిక్రమించడం కిందకే వస్తుందంటూ దిల్ రాజుపై చర్యకు ఛాంబర్ సమయాత్తమవుతోందని తెలుస్తోంది. దిల్ రాజు కంటే ముందు 'మగధీర' ఆడియో ఫంక్షన్ ను మాటీవీకి ఇవ్వడంపై ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ పై కూడా ఛాంబర్ గుర్రుమంది. అల్లు అరవింద్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోలేదట. ఈ క్రమంలో అల్లు అరవింద్ వ్యవహారం తేలిన తర్వాతే దిల్ రాజు వైపు ఛాంబర్ దృష్టిసారించే అవకాశముందని పలువురు అంటున్నారు.
Be first to comment on this News / Article!
|