వదంతులతో విసిగిపోయా: వర్మ
తెలుగులో మరిన్ని సినిమాలు తీయాలనే ఆలోచన ఉన్నప్పటికీ అందుకు తగిన సమయం దొరకడం లేదనీ, ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాననీ వర్మ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే భవిష్యత్ లో తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తానని స్పష్టం చేశారు. 'రక్త చరిత్ర'కు రాజకీయ నేపథ్యం ఉండబోతోందా అనే అంశంపై మాట్లాడుతూ, రాజకీయాలతో తనకు సంబంధం లేదనీ, ఆ కోణంలో తాను ఆలోచించ లేదనీ చెప్పారు. ఇందులోని ప్రధాన పాత్రధారుల జీవితాల్లో వచ్చిన మార్పునకు ఏ అంశాలు ప్రేరణగా నిలిచాయనే పాయింట్ తో భావోద్వేగాల కోణంలో సినిమా ఉంటుందన్నారు. అక్టోబర్ లో అనంతపురం, వెంకటాపురం, మద్దెల చెరువు తదితర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 'రణ్' చిత్రంలో మీడియోపై ధ్వజమెత్తినట్టు వస్తున్న వదంతులను కూడా వర్మ కొట్టివేశారు. ఇందులో ఎంతమాత్రం నిజంలేదనీ, ప్రస్తుతం రాజకీయ నాయకులు మీడియోను ఉపయోగించుకుని ప్రజలకు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారనే అంశాలను చూపిస్తున్నట్టు చెప్పారు.
ప్రియాంక కొఠారిని తరచు తన సినిమాల్లో తీసుకోవడం ద్వారా వర్మ ఆమెపై మనసు పారేసుకున్నాడంటూ తరచు వినవచ్చే వదంతులను ఆయన నవ్వుతూ తిప్పుకొట్టారు. ఇలాంటి వదంతులతో విసుగెత్తిపోయాననీ, గత రెండేళ్లుగానే ఆమెతో పనిచేస్తున్నాననీ, అది కూడా రెండు సినిమాలు చేశామనీ చెప్పారు. 'రక్తచరిత్ర'లో కానీ, 'రణ్'లో కానీ ఆమె ఉండబోవడం లేదన్నారు. తాను కొత్తమ్మాయిని తీసుకున్న ప్రతిసారి ఇలాంటి వదంతులు ప్రచారంలోకి రావడం షరామామూలైందని నవ్వుతూ సమాధానమిచ్చారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|