వదంతులతో విసిగిపోయా: వర్మ
తెలుగు సినిమాను 'శివ'తో కొత్త పుంతలు తొక్కించిన వర్మ బాలీవుడ్ 'సత్య', 'రంగీలా', 'సర్కార్' చిత్రాలతో సంచలన దర్శకుడిగా విజయకేతనం ఎగురవేశారు. 'గోవిందా గోవిందా' సినిమా సమయంలో వర్మ తనకెదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇక తెలుగులో సినిమాలు తీసేది లేదని భీష్మించారు. అయితే వీలున్నప్పుడల్లా తన శిష్యులకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి తెలుగులో సినిమాలు నిర్మిస్తున్నారు. సహజంగా వర్మ సినిమాలు విడుదలైన తర్వాత సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇటీవల కాలంలో వర్మ సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకోవడం పరిపాటైంది. వర్మ తాజా చిత్రం 'అగ్యాత్' సైతం ఇందుకు మినహాయింపు కాదు. ప్రియాంక కొఠారి నటించిన పాటలోని ఓ బిట్ సెన్సార్ కత్తెరకు బలైంది.ఈ చిత్రం తెలుగులో 'అడవి' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు హీరో నితిన్, హిందీ నటి ప్రియాంక కొఠారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ వర్మ్ కోసం హైద్రాబాద్ వచ్చిన వర్మ 'అడవి' పాటపై సెన్సార్ వేటు, విడుదలకు సిద్ధంగా ఉన్న 'రణ్', అక్టోబర్ లో తెరకెక్కనున్న 'రక్తచరిత్ర' గురించి ముచ్చటించారు.
'అడవి సినిమాలోని జై శ్రీ శంభు పాటలో ప్రియాంక కొఠారి చిలుము పీల్చే సీన్ ఉంది. దీనిపై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ సాంగ్ ను రీ-ఎడిట్ చేశాం. ఆ సాంగ్ ఇప్పుడు ఛానెల్స్ లో ప్రసారమవుతోంది' అని వర్మ తెలిపారు. తరచు వివాదాలలో చిక్కుకోవడానికి ప్రస్తావిస్తూ, ఒకరి అభిప్రాయలతో మరొకరు అభిప్రాయాలు కలవనప్పుడే ఇలాంటి పరిస్థితి తలెత్తుందన్నారు. విలక్షణమైన సబ్జెక్టులు, థీమ్ లతో సినిమాలు తీయడం తనకు ఇష్టమనీ, ఇది నచ్చనప్పుడు అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయనీ అన్నారు. 'అడవి' చిత్రం సాంకేతక విలువతో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్ అనీ, ప్రేక్షకులను వినూత్న లోకానికి తీసుకు వెళ్లే సినిమా ఇదనీ చెప్పుకొచ్చారు. షూటింగ్ కోసం ఓ సినిమా యూనిట్ అడవిలోకి వెళ్తుందనీ, ప్రశాంతంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్ లో ఒక్కొక్కరూ హత్యకు గురువుతూంటారనీ, ఈ హత్యలు చేస్తున్నది మనిషా, మృగమా, మానవాతీత శక్తా అనేది మాత్రం తెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|