కమల్ 'ఈనాడు' వెనక్కి!
విలక్షణ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ 'దశావతారం' తర్వాత ప్రిస్టేజియస్ గా తీసుకుని నటిస్తున్న 'ఈనాడు' చిత్రం సెప్టెంబర్ రిలీజ్ గా ఉండబోతోందని తాజా సమాచారం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్టు తొలి వార్తలు వెలువడ్డాయి. అయితే ఆగస్టులో పోటీపోటీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో సెప్టెంబర్ సేఫ్ రిలీజ్ గా దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31న 'మగధీర'తో మొదలుపెట్టి ఆగస్టులో 'మల్లన్న', 'జోష్', 'ఆంజనేయులు' వంటి పలు చిత్రాలు టాలీవుడ్ లో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
హిందీలో నీరజ్ పాండే దర్శకత్వంలో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో ఘనవిజయం సాధించిన్ 'ది వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా 'ఈనాడు' రూపొందుతోంది. ప్రస్తుతం 95 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగుల దశలో ఈ చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని యుటివి ప్రొడక్షన్స్ తో కలిసి కమల్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ పతాకంపై నిర్మిస్తున్నారు. కమల్ 'సాగరసంగమం' చిత్రంలో బాల ఫోటోగ్రాఫర్ గా నటించిన చక్రి ఈ చిత్రానికి దర్శకత్వ వహిస్తున్నారు. శృతి కమల్ హాసన్ (కమల్ కుమార్తె) సంగీతం అందిస్తున్నారు. తెలుగు వెర్షన్ లో విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆసక్తికరంగా ఇది కమల్ నటుడిగా 50వ వసంతలోకి అడుగుపెడుతున్న సిల్వర్ జూబ్లీ వత్సరం కూడా. ఐదేళ్ల ప్రాయంలోనే బాలనటుడిగా అడుగుపెట్టన కమల్ తొలిసారి నటించిన 'కలత్తూర్ కన్నమ్మ' చిత్రం 1959 ఆగస్టు 12న విడుదలైంది.
Be first to comment on this News / Article!
|