కార్తిక కాదు..జోషిక!
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక ఈమధ్యన 'జోష్' ఆడియో వేడుకలో చూసిన వారికి బాగానే గుర్తుండిపోతుంది. స్టన్నింగ్ బ్యూటీగా కాకపోయినా గుక్కతిప్పుకోకుండా ఆమె చేసిన స్పీచ్ పలువురు దృష్టిని ఆకట్టుకుంది. నాగార్జున తనయుడు నాగచైతన్య 'జోష్' తొలి సినిమా అయితే, కార్తికకు కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. ఆడియో ఫంక్షన్ లో కార్తికను జనం ముందుకు తెచ్చినప్పటికీ ఇంతవరకూ కార్తిక-నాగచైతన్య కాంబినేషన్ స్టిల్స్ కానీ, కార్తిక సోలో స్టిల్స్ కానీ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయలేదు. నిజానికి 'జోష్' అనే టైటిల్ ను కూడా అనుకోనప్పటికీ వెబ్ సైట్లలో ఆ పేరుతోనే పాపులర్ కావడంతో దిల్ రాజు అదే పేరును కన్ ఫర్మ్ చేసేశారు. ఇప్పుడు 'జోష్' టైటిల్ అంతటా ప్రచారం జరగడంతో హీరోయిన్ కార్తిక పేరు జోషికగా మార్చాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు యూనిట్ వర్గాల కథనం.
కార్తిక పేరు బయటకు రాగానే కొందరు మరింత ఆచూకి తీసి ఆమె ఇంతకుముందే తమిళంలో అరంగేట్రం చేసిందనీ, కాకపోతే ఆమె నటించిన మూడు సినిమాలు ఇప్పటికీ వెలుగుచూడనే లేదనీ చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రాధ తన కుమార్తెను టాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం చేయాలని అనుకోవడం...'జోష్' కార్తిక ఒళ్లో వాలడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో కార్తిక పేరు కంటే జోషిక అనే పేరు టైటిల్స్ లో వేస్తే సినిమా పబ్లిసిటీకి కూడా ఉపకరిస్తుందని చిత్రయూనిట్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఏపేరు తెరమీదకు వస్తుందో చూడాలి...
Be first to comment on this News / Article!
|