'ఆంజనేయులు' ఆగస్టు 12న
రవితేజ, నయనతార జంటగా పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిరిస్తున్న భారీ చిత్రం 'ఆంజనేయులు'. ఈ చిత్రం చివరి పాట చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుందని గణేష్ తెలిపారు.
రవితేజ కెరీర్ లోనే బిగ్సెస్ట్ హిట్ గా నిలిచేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారనీ, రవితేజ బాడీలాంగ్వేజ్, నయనతార గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ అవుతాయనీ చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదల ఆడియో సూపర్ హిట్ అయిందని అన్నారు. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎంఎస్ నారాయణ, సన, వినయ ప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. కె.రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|