3 రోజుల కలెక్షన్ 15 కోట్లు
కలా? నిజమా? వైష్ణవమాయా?. పెట్టుబడి 35 నుంచి 40 కోట్లు. రాబడి 3 రోజుల్లో 15 కోట్లు. రామ్ చరణ్ కథానాయకుడుగా శుక్రవారం విడుదలవుతున్న 'మగధీర' చిత్రానికి బుకింగ్స్ తెరిచిన గంటలోపే మూడు రోజుల వరకూ బుక్సింగ్ పూర్తయిపోయాయి. దీంతో తొలి మూడు రోజులకే ఈ చిత్రం 15 కోట్ల వరకూ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
థియేటర్లలో గరిష్ట స్థాయి టిక్కెట్ 50 రూపాయలు ఉండటం, ప్రపంచవ్యాప్తంగా 1500 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుండటంతో కలెక్షన్లు కూడా టాప్ రేంజ్ లో ఉండబోతున్నాయనీ, హిట్ టాక్ మొదలైతే తొలి పది రోజుల్లోనే కలెక్షన్ల సునామీతో పెట్టుబడి రాబట్టుకుని తర్వాత నుంచి లాభాల బాట పడుతుందనీ ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అల్లు అరవింద్ సైతం ఈ చిత్రాన్ని ప్రిస్టేజియస్ గా తీసుకుని పైరసీదారులపై గట్టి నిఘా వేసేందుకు 21 స్పెషల్ స్వ్కాడ్ లను బరిలోకి దింపారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|