మళ్లీ 'హ్యాపీడేస్' జంట
తొలిచిత్రం 'ఆర్య'తో మంచి సక్సెస్ సాధించిన సుకుమార్ ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా 'ఆర్య-2' చిత్రాన్ని అల్లు అర్జున్ కథానాయకుడుగా శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి వర్కింగ్ టైటిల్ గా 'ఆర్య-2' ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు 'ఆక్రందన' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ ఒక ప్రేమకథా ఇతివృత్తాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే కథానాయికగా తమన్నా ఎంపికైంది. తాజాగా తమన్నా సరసన వరుణ్ సందేష్ ను కథానాయకుడిగా ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. వరుణ్, తమన్నా ప్రేమికులుగా తొలిసారి 'హ్యాపీడేస్' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ కావడంతో ఈ జంటకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ విడివిడిగా సినిమాల్లో బిజీ అయ్యారు. కొన్ని హిట్లు కూడా సాధించారు. ఇప్పుడు ఆ జంటను తిరిగి కలుపుతూ మరో సెన్సేషన్ సృష్టించాలని సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది.
సుకుమార్ ప్రాజెక్ట్ ఇదే ఏడాది ఉంటుందనీ, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారనీ తెలుస్తోంది. హిందీ 'గజనీ', రామ్ చరణ్ 'మగధీర' చిత్రాల తర్వాత అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ ను చేపడుతుండటం మరింత క్రేజ్ అవుతుంది. ప్రస్తుతం వరుణ్ సందేష్ తమిళ 'పొల్లదావన్' రీమేక్ గా వస్తున్న 'కుర్రాడు' చిత్రంలోనూ, దిల్ రాజు 'మరో చరిత్ర' లోనూ నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|