వర్మ పేరు మార్చారు: నితిన్
సస్పెన్స్ ఎలిమెంట్...
'అడవి' సినిమాలోని పాయింట్ ఇప్పటి వరకూ వచ్చిన హారర్, థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మారణహోమానికి పాల్పడే అదృశ్య శక్తి ఏమిటనేది చివరివరకూ తెలియదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. ఈ తరహా చిత్రాలు హాలీవుడ్ లో వచ్చినా మనదేశంలో ఇదే తొలి ప్రయత్నమని చెప్పవచ్చు. ఒక్కమాటలో చెబితే వర్మ తన కెమెరాతో ప్రేక్షకులను భయపెడతారు.
షూటింగ్ లో సాహసం
శ్రీలంకలోని దట్టమైన సిగిరియా అడవులను ఈ సినిమా షూటింగ్ కోసం వర్మ ఎంచుకున్నారు. అక్కడ నాలుగు కీలోమీటర్లకు ఒక చెక్ పోస్టు ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వానికీ, ఎల్టీటీఈకీ మధ్య యుద్ధం జరుగుతోంది. సాహసంతోనే అక్కడ షూటింగ్ చేశాం. పాములు, ఇతర క్రూర జంతువులు సంచరించే అడవుల్లో ధైర్యంగా షూటింగ్ పూర్తి చేసుకుని హ్యాపీగా తిరిగి వచ్చాం.
ఎయిట్ ప్యాక్ చేశా
'విక్టరీ' చిత్రం కోసం ఎయిట్ ప్యాక్ చేశాను. మళ్లీ వర్మ సూచన మేరకు ఈ చిత్రం చేశాను. పలు రిస్కీ ఫైట్స్ కూడా చేశాను. ఆసక్తికరమైన మరో విషయం ఉంది. ఈ చిత్రంతో నన్ను హిందీకి నితిన్ రెడ్డిగా వర్మ పరిచయం చేస్తున్నారు.
పెళ్లి...పెళ్లి ఇప్పుడే కాదు
ప్రేమ, పెళ్లి అనే ఆలోచన ఇప్పట్లో లేదు. అలాగే ఏ హీరోయిన్ తో కూడా నాకు అపైర్ లేదు. గాసిప్స్ వచ్చినా చూసి నవ్వుకుంటాను. 'అగ్యాత్' తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ప్రస్తుతం వెల్ఫేర్ క్రియేషన్స్ 'రెచ్చిపో' సినిమాలో నటిస్తున్నాను.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|