వర్మ పేరు మార్చారు: నితిన్
'జయం', 'దిల్' వంటి పలు చిత్రాలతో యువహీరోల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నితిన్ ఇటీవల కాలంలో యాక్షన్ హీరోగా కూడా యువతను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. అయితే సరైన సక్సెస్ కోసం కొద్దికాలంగా ఎదురుచూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తొలిసారి ఆయన హిందీలో నటించిన 'అగ్యాత్' చిత్రం తెలుగులో సైతం 'అడవి' పేరుతో ఈనెల 7వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతవరకూ తాను నటించిన చిత్రాల్లో నటనపరంగా ది బెస్ట్ మూవీ ఇదని నితిన్ చెబుతున్నారు. తాను రామ్ గోపాల్ వర్మ అభిమానిననీ, ఆయన చిత్రంలో నటించడం మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ అనీ అంటున్నారు. నితిన్ మనోభావాలు ఆయన మాటల్లోనే...
ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారు
రామ్ గోపాల్ వర్మ అభిమానుల్లో నేనూ ఒకరిని. ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం వస్తుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. 2002లో 'దిల్ ' షూటింగ్ కోసం ముంబై వెళ్లి విమానంలో తిరిగివస్తుండగా తొలిసారి ఆయనను కలిశాను. 'జయం' సినిమాలో బాగా చేశావంటూ వర్మే తొలుత పలకరించారు. అప్పట్నించీ ఆయనతో టచ్ లో ఉంటున్నాను. హైద్రాబాద్ వచ్చినప్పుడు కలుస్తుండే వాడిని. గత ఏడాది ఆయన నుంచి ఫోన్ వస్తుంది. ముంబై వెళ్లగానే ఓ కథ చెప్పి నిన్నే హీరో అనుకుంటున్నానని చెప్పారు. నాకు నోట మాట రాలేదు. ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. అదే 'అడవి' చిత్రం.
టెన్షన్ పెట్టరు...
వర్మ వర్కింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భారతీయ సినిమా నడకను మార్చిన దర్శకుడాయన. నటీనటుల నుంచి నటన రాబట్టుకునే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఆర్టిస్ట్ ను టెన్షన్ పెట్టరు. తానూ టెన్షన్ పడరు. హాయిగా పని చేసుకుని పోతుంటారు. ఆర్టిస్టులు ఎలా అనుకుంటారో అలానే నటించమని చాలా స్వేచ్ఛ ఇస్తారు. అలా చేయడం వలన సన్నివేశం చాలా సహజంగా వస్తుంది. నటనపరంగా ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో ఇది చాలా మంచి చిత్రమని చెప్పగలను.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|