'మగధీర' కలెక్షన్ 20 కోట్లు
'అరుంధతి' సాధించిన సూపర్ సక్సెస్ తర్వాత సెమీ పీరియాడిక్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ 'మగధీర' చిత్రం తొలి వారం భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ఈ చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లో 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాల గణాంకాల ప్రకారం నైజాం ఏరియాలో ఈ చిత్రం 7 కోట్లు వసూలు చేయగా, రాయలసీమలో 5, ఆంధ్రలో 8 కోట్ల రూపాయలు వసూలైంది. రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
'మగధీర' చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టుకుంటూ, మంచి టాక్ ను సాధించడం పట్ల రామ్ చరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేయడానికి మరికొద్ది రోజులు ఆగవలసి ఉంటుందనీ, సినిమా బాక్సాఫీస్ రిటర్న్స్ కు తాను ఒక్కడే కారణం కాదనీ, 200 మందికి పైగా యూనిట్ సిబ్బంది అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుందనీ చరణ్ తెలిపారు. సమష్టి కృషికి ఈ చిత్ర విజయం తార్కాణమనీ, మామయ్య అల్లు అరవింద్ (చిత్ర నిర్మాత) తనకు ఇచ్చిన అపూర్వమైన కానుక ఈ చిత్ర విజయమని అభివర్ణించారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|