ప్రభాస్ పెళ్లి మార్చిలో!
'యాండీ..ఏదో ఒకటి మాట్లాడండి' అంటూ 'బుజ్జిగాడు' చిత్రంలో త్రిష మనసు దోచుకునేందుకు ఆరడుగుల అందగాడు ప్రభాస్ పడిన తపన ఆయనను మాన్లీ హీరోగా నిలబెట్టి పెళ్లికాని అమ్మాయిల మనసులకు దగ్గర చేసింది. 'బిల్లా'తో స్టయిలిష్ హీరోగా కూడా యూత్ కు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను అభిమానించే లేడీ అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూసే కావచ్చు. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకోబుతున్నట్టు సమచారం.
ప్రభాస్ తన తోటి బ్యాచిలర్స్ హీరోలతో పోలిస్తే ఎలాంటి ఎఫైర్లతో అతని పేరు ఇంతవరకూ ముడిపడక పోవడం లక్కీనే. క్రమశిక్షణ కలిగిన నటుడు కృష్ణంరాజు వారసుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తన పెదనాన్న బాటలోనే పేరు తెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోగా నిలదొక్కుకుని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ను ఓ ఇంటివాడిని చేయలని ఆయన కుటుంబ సభ్యులు కొద్దికాలంగా కోరుకుంటున్నారు. పెద్దలు చూసిన అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారనీ, ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్ పెళ్లి పీటల మీద కూర్చోవచ్చని చెబుతున్నారు. అయితే ప్రభాస్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టివేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటిస్తూ, కరుణాకరన్ దర్శకత్వంలో
రూపొందనున్న 'డార్లింగ్' చిత్రానికి కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|