బాలయ్యతో మల్లికా షెరావత్?
యువరత్న బాలకృష్ణ హై-ఓల్టేజ్ నటనకు ముగ్గురు సెక్సీ బ్యూటీస్ గ్లామర్ ఇమేజ్ కూడా తోడవనుంది. బాలకృష్ణ కథానాయకుడుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కీర్తి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సింహా' చిత్రం కోసం ప్రస్తుతం చురుగ్గా హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. ఇదులో ముగ్గురు క్రేజీ హీరోయిన్లు ఉంటారని బోయపాటి శ్రీను ప్రకటించినప్పటి నుంచి ఆ హీరోయిన్లు ఎవరై ఉంటారనే ఉత్సుకత మొదలైంది. భారీ అందాల బ్యూటీ నమిత ఇప్పటికే ప్రధాన హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. సెకెండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మినిస్సా లంబాను ఒప్పించే ప్రయత్నాలు కూడా చరుకుగా జరుగుతున్నాయి. ఆసక్తికరంగా బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ ఈ చిత్రంలో మూడో హీరోయిన్ గా కనిపించబోతోందనే ప్రచారం జరుగుతోంది.
హిందీ, తమిళ చిత్రాలతో పాటు 'ది మిత్'తో హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన మల్లికా షెరావత్ ను గతంలో పలుమార్లు టాలీవుడ్ కు రప్పించే ప్రయత్నాలు జరిగినా ఆచరణలో సాధ్యం కాలేదు. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమాలో నటించేందుకు ఆమెను ఒప్పించగలిగితే అది నిస్సందేహంగా సంచలనమే అవుతుంది. నమిత, మినిస్సాలకు మల్లికా తోడైతే ఇక గ్లామర్ ఖజానా వెండితెరపై పరుచుకున్నట్టే. ఈనెల 24 నుంచి 'సింహా' రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఆసరికి హీరోయిన్లు ఎవరనై సస్పెన్స్ కు కూడా తెరపడుతుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|