'శంఖం' సెప్టెంబర్ 4న
గోపిచంద్, త్రిష తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'శంఖం'. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై శివ ('శౌర్యం' ఫేమ్) దర్శకత్వంలో జె.భగవాన్, పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
గోపీచంద్ చిత్రాల్లోనే భారీ బడ్జెట్ తో చక్కటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్టు నిర్మాతలు తెలిపారు. గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ చిత్రం చాలా బాగా వచ్చిందనీ, ఆయన నటన, గ్లామర్ తో కూడిన త్రిష అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని వారు తెలిపారు. శంఖం పూరించడమంటే యుద్ధానికి సిద్ధం కమ్మని ప్రత్యర్థులకు తెలియజేయడమేననీ, ఇందులో కథానాయకుడు ఎవరిపై శంఖం పూరించారనేది ఆసక్తికరంగా ఉంటుందనీ, ఇందులో కొత్త గోపీచంద్ ను చూస్తారనీ శివ చెప్పారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, హంటర్ వ్యాలీ, ఒపేరా హౌస్, డార్లింగ్ హార్బర్ వంటి సుందర ప్రదేశాల్లో తీసిన పాటలు, కొన్ని కీలక దృశ్యాలు హైలైట్ గా ఉంటాయన్నారు. ఇందులో తమిళ నటుడు సత్యరాజ్ ఓకీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆలీ, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల, రాధాకుమారి తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, విజయ్, సెల్వ, గణేష్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, తమన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|