సోనియా-సెల్వ విడాకులు?
ఒకే రంగంలో పనిచేసే వాళ్లు పెళ్లి చేసుకుంటే ఒకరి సాధక బాధకాలు మరొకరికి తెలుస్తాయి కాబట్టి సజావుగా కాపురాలు సాగుతాయంటారు. సినీరంగంలోనూ ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువే. అయితే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నంత కాలం కూడా సినీ జంటల కాపురాలు సజావుగా సాగని పరిస్థితులు తరచు తలెత్తుతూనే ఉన్నాయి. నటి సీత-పార్దీపన్ ప్రేమించు పెళ్లిచేసుకుని విడిపోయారు. ప్రకాష్ రాజ్-లత జంట కూడా విడాకులకు సిద్ధంగా ఉన్నారు. కమల్-సారిక వ్యవహారం తెలిసిందే. తాజాగా మరో ప్రేమజంట కూడా పరసర్ప అంగీకారం మేరకు విడాకులు కోరుకుంటున్నట్టు సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. 'ఆడవారి మాటలకు ఆర్థాలు వేరులే', '7/జి బృందావన్ కాలనీ' చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. '7/జి...' చిత్రం షూటింగ్ లోనే ఆ చిత్ర కథానాయిక సోనియా, సెల్వ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో మూడుముళ్ల బంధంతో వారిద్దరూ దంపతులయ్యారు. ఇప్పుడు వీరి వైవాహిక బంధం కూడా చిక్కుల్లో పడిందనీ, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకోవాలని అనుకుంటున్నారనీ వినిపిస్తోంది.
తాజా సమచారం ప్రకారం విడాకులు తీసుకోవాలనే విషయంలో సోనియా-సెల్వ కృతనిశ్చయంతో ఉన్నారట. సోనియా అగర్వాల్ గత బుధవారంనాడు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ముందు విడాకుల పిటీషన్ వేసేందుకు హాజరుకావడం వీరిపై ఇంతవరకూ వస్తున్న వదంతులకు బలం చేకూరుతోందని అంటున్నారు. పరసర్ప అంగీకారం మేరకే ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని కూడా చెబుతున్నారు. నిజానిజాలు నిలకడ మీదే తేలాలి...
Be first to comment on this News / Article!
|