నిన్న చిరు..నేడు దిల్ రాజు!
మెగాస్టార్ చిరంజీవికీ, డేరంగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూ సామీప్యం గురించి మనం చెప్పుకోవడం లేదు. కాకుంటే అప్పట్లో చిరంజీవిని ఉద్దేశించే ఓ క్యారెక్టర్ క్రియేట్ చేశారంటూ జరిగిన ప్రచారం తరహాలోనే ఇప్పుడు దిల్ రాజును దృష్టిలో పెట్టుకునే 'ఆంజనేయులు' చిత్రంలో ఓ పాత్ర చేత పేరడీ చేయించారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. ఆసక్తికరంగా ఈ రెండు సందర్భాల్లోనూ కమెడియన్ ఎం.ఎస్.నారాయణ చేతనే ఈ తరహా పేరడీలు చేయించారు.
'ఆంజనేయులు' చిత్రంలో నిర్మాత పాత్రలో ఎమ్మెస్ నారాయణ ఒకే సన్నివేశంలో కనిపిస్తారు. కేవలం ఆరు సినిమాలు తీసి నూరు సినిమాలు తీసిన బిల్డప్ ఇస్తుంటారాయన. రెండు వారాలు ఆడే సినిమాకి కూడా పబ్సిసిటీ దుమారం రేపుతుంటాడు. ఎచ్ ఎంటివీ ఛానెల్ లైవ్ షోలో పాల్గొని సొంత డబ్బా కొడుతుంటే...రవితేజ ఫోనులోనే ఎంట్రీ ఇచ్చి చెడామడా దులిపేస్తాడు. దాంతో ఎమ్మెస్ అక్కడ్నించి ఉడాయిస్తాడు. దిల్ రాజును టార్గెట్ చేసుకునే ఎమ్మెస్ పాత్ర, సంభాషణలు కనిపిస్తాయనేది సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలోనూ ఎమ్మెస్ నారాయణ 'దుబాయ్ శీను' చిత్రంలో ఫైవ్ స్టార్ సల్మాన్ రాజ్ గా నటించారు. ఆ పాత్ర చిరంజీవిని ఉద్దేశించే దర్శకుడు శ్రీనువైట్ల సృష్టించారనే ప్రచారమూ జరిగింది. అంతకుముందే చిరంజీవి-శ్రీనువైట్ల కాంబినేషన్ లో 'అందిరివాడు' వచ్చింది కూడా.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|