పిఎస్ఎస్ ఎంటర్ టైన్స్ 'శంఖం'
గోపీచంద్, త్రిష జంటగా శ్రీ బాలాజీ సినీ మీడియో పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శంఖం'. గోపీచంద్ తో గత ఏడాది 'శౌర్యం' వంటి హిట్ చిత్రాన్ని అందించిన శివ ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అమెరికాలోని థియేటర్లలో ప్రదర్శించే ఓవర్సీస్ హక్కులను పిఎస్.ఎస్.ఎంటర్ టైన్ మెంట్స్, డెలవేర్ సినిమా సంయుక్తంగా దక్కించుకుంది.
గోపీచంద్ తో త్రిష తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. అలాగే గోపీచంద్ టైటిల్స్ లో చివరన సున్నా ఉంటే ఆ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా పరిశ్రమలో ఉంది. గోపీచంద్ విలన్ గా నటించిన 'జయం', 'వర్షం', హీరోగా నటించిన 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం' చిత్రాలు మంచి సక్సస్ ను సాధించడంతో 'శంఖం'పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హైద్రాబాద్ తో పాటు ఆస్ట్రేలియాలోని పలు రిచ్ లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. స్టైలిష్ మేకింగ్ లో పేరున్న శివ ఈ చిత్రాన్ని సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా తెరకెక్కించారు. ఆలీ, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి వంటి పలువురు కమెడియన్లతో రూపొందించిన కామెడీ ట్రాక్ హైలైట్ కానుంది. 'కిక్', 'ఆంజనేయులు' చిత్రాలను మ్యూజికల్ హిట్ చేసిన థమన్ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు. పిఎస్ఎస్ ఎంటర్ టైన్ మెంట్ మెయిడిన్ వెంచర్ గా 'శంఖం' చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తమకు అందించిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సోమ, సుధాకర్, హరి, నిర్మాత భగవాన్ లకు ఆ సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సినిమాలను ఆదిరంచే ప్రేక్షకులందరికీ తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆయా సిటీల్లో ప్రదర్శించాలనుకునే వారు Kumar (908) -462-2831 or E-mail us at pssmovies@gmail.com ను సంప్రదించవచ్చు.
Be first to comment on this News / Article!
|