28న వస్తున్న 'రణధీర'
హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో జాకీచాన్ తనయుడు జైసిచాన్ ఇప్పుడు హీరో అయ్యారు. వెండితెరపై సాహసాల విషయంలోనూ తండ్రికి మించిన తనయుడిగా అనిపించుకుంటున్నారు. జైసిచాన్ హీరోగా జెన్సీచాన్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'ఎంఐ4: ఇన్విజబుల్ టార్గెట్'. ఈ చిత్రాన్ని పికాక్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై మాస్టర్ అమాన్ సమర్పణలో నిర్మాత జమ్ము 'రణధీర' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
ప్రపంచ దేశాల్లో జాకీ చిత్రమంటే ఎంతో క్రేజ్ ఉందనీ, ఆయన తనయుడు జైసీచాన్ చిత్రం హాలీవుడ్ లో విడుదలకావడంతో ఇండియాలోనూ ఆసక్తి నెలకొందనీ చెప్పారు. ఇప్పటికే పలుచోట్ల విడుదలై ప్రేక్షకాదరణ చూరగొందని చెప్పారు. కోట్లాది రూపాయలు ఉన్న ఓ క్యాష్ ట్రక్ ను దోపిడీ గ్యాంగ్ సొంతం చేసుకుంటుందనీ, ఆ గ్యాంగ్ ను పట్టుకునే ముగ్గురు పోలీసు అధికారుల సాహసాలతో ఈ చిత్రం తెరకెక్కిందనీ తెలిపారు. జైసిచాన్ యాక్షన్ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నివోలాస్, షావన్, యుజింగ్, క్వంగ్, లమ్ కవాహ్, సమ్ లీ తదితరులు నటించారు. శశికుమార్ తెలుగులో సంభాషణలు అందించారు.
Be first to comment on this News / Article!
|