కమల్ 'ఈనాడు' సెప్టెంబర్ 18
పద్మశ్రీ కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన 'ఈనాడు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్' పేరుతో విడుదల కానుంది. తమిళ వెర్షన్ లో కమల్ హాసన్, మోహన్ లాల్ కలిసి నటించారు. హిందీలో విజయవంతమైన 'ది వెన్స్ డే' చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసే హక్కులను అమ్మ ఆర్ట్ క్రియేష్స్ అధినేత జి.కుమార్ బాబు తీసుకున్నారు.
'ఈనాడు' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు గట్టి పోటీ ఎదురైందనీ, ఈ పోటీలో ఈ చిత్రం హక్కులు తమకు దక్కడం ఆనందంగా ఉందనీ కుమార్ బాబు తెలిపారు. ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ చిత్రం హక్కులు తీసుకున్నామన్నారు. ఇందుకు సహకరించిన చంద్రహాసన్, కమల్ హాసన్ లకు తన ప్రత్యేక ధన్యవాదాలని పేర్కొన్నారు. ఈనెలలోనే ఆడియో విడుదల చేసి, సెప్టెంబర్ 18న సినిమా విడుదలకు నిర్ణయించామని చెప్పారు. యూటీవీ, రాజ్ కమల్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చక్రి తోలేటి (కమల్ 'సాగరసంగమం'లో బాల ఫోటోగ్రాఫర్) దర్శకత్వం వహించారు. కమల్ కుమార్తె శ్రుతి తొలిసారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|