రాధామోహన్ డైరెక్షన్ లో నాగ్?
యువసామ్రాట్ నాగార్జున మళ్లీ పూర్తి స్థాయి యాక్షన్ లోకి వస్తున్నారు. ఆయన నటించిన 'కింగ్' విడుదలై ఆరు నెలలు దాటింది. ఈ గ్యాప్ లో తన కుమారుడు నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న 'జోష్' చిత్రంపై ఆయన దృష్టి సారించారు. ఆ చిత్రం ఈనెల 29న నాగార్జున బర్త్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి తోడు నాగచైతన్య ద్వితీయ చిత్రం కూడా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో గత వారమే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నాగార్జున మళ్లీ తన సినిమాల వైపు మళ్లారు. ఈమధ్యనే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకొన్న తన కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతున్నారు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గుంటూరులో నాలుగురోజుల షెడ్యూల్ తర్వాత నాగార్జున సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రం తర్వాత నాగార్జున ఓ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి రాధామోహన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన 'ఆకాశమంత' చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం చూసిన నాగార్జున ఎంతో ఇంప్రెస్ అయ్యారనీ, రాధామోహన్ తో పనిచేసేందుకు ఆసక్తి చూపించారనీ తెలుస్తోంది. దీనిని తమిళ, తెలుగు భాషల్లో రూపొందించే అవకాశాలున్నాయి. గతంలో 'రక్షకుడు' చిత్రం ద్వారా నాగార్జున తమిళంలోకి కూడా అడుగుపెట్టారు. త్వరలోనే నాగార్జున-రాధామోహన్ కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావచ్చు.
Be first to comment on this News / Article!
|