సోనియా ఆత్మహత్యాయత్నం
ప్రేమించి పెళ్లిచేసుకున్న'7/జి బృందావన్ కాలనీ' హీరోయిన్ సోనియా అగర్వాల్, ఆ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ పరస్పర అంగీకారం మేరకు విడాకులు తీసుకోబుతున్న విషయం ఇప్పుడు అందరి నోటా నానుతోంది. వీరి వివాహ బంధం విచ్ఛిన్నమైందంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ గత వారంలోనే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం సోనియా ఆశ్రయించడంతో ఆ వ్యవహారం బహిర్గతమైంది. దీనికి ఇప్పుడు చిలవలూ పలవలూ తోడయ్యాయి. సోనియా డిప్రషన్ లోకి వెళ్లిపోయందనీ, ఆత్యహత్యాయత్నానికి పాల్పడిందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సోనియా మీడియా వర్గాలపై కారాలు మిరియాలు నూరుతోంది. 'నేను ఆత్యహత్యా యత్నం చేయడం ఏమిటి? తెలివుండే ఇలాంటి రాతలు రాస్తున్నారా?' అంటూ విరుచుకుపడుతోంది.
'ఎవరి బుర్రనో కుమ్మరపురుగు తొలిచి ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నట్టు ఉంది. ఇంత కుళ్ల జోకు వేయాల్సిన అవసరం లేదు. నేను చాలా గట్స్ ఉన్న అమ్మాయిననే విషయం తెలియకపోవచ్చు. గతంలో కూడా జీవితంలో ఎదురైన ఎన్నో ఒడుగులను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు కూడా జిమ్ నుంచి వచ్చి షూటింగ్ కు బయలుదేరుతున్నాను' అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఆలోచనలో స్పష్టత, మనసులో ప్రశాంతత ఉన్న తనకు దుందుడుకు చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదనీ, ఒకవేళ తమ (భార్యాభర్తల) జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎవరికి తోచిన రీతిలో వారు పరిష్కరించుకుంటామనీ, మీడియా ముందుకు వెళ్లేది లేదనీ తెగేసి చెప్పింది. ప్రస్తుతం సోనియా తన స్వస్థలమైన చండీఘడ్ లో ఉంటూ బుల్లితెర కెరీర్ పై ఫోకస్ చేయాలనుకుంటోందట.
Be first to comment on this News / Article!
|