'ఏక్ నిరంజన్' అక్టోబర్ 29న
ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఏక్ నిరంజన్'. పూరీ జగన్నాథ్ సమర్పకుడు. ఈ చిత్రం 35 రోజుల పాటు థాయ్ లాండ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. ఆదిత్యరామ్ ఆ విశేషాలను తెలియజేశారు.
ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పూరీ జగన్నాథ్ అద్భుతమైన సబ్జెక్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ, ప్రభాస్-పూరీ కెరీర్ లో ఇదో బ్లాక్ బస్టర్ అవుతుందనీ చెప్పారు. ఇటీవల థాయ్ లాండ్ లోని బ్యాంకాక్, పట్టాయలలో చేసిన భారీ షెడ్యూల్ క్లైమాక్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామనీ, 20 రోజుల పాటు తీసిన క్లైమాక్స్ లో ఇండియన్ ఫైటర్స్ తో పాటు యూరప్ ఫైటర్లు కూడా పాల్గొన్నారనీ చెప్పారు. హాలీవుడ్ హీరో జాచీచాన్ తో సోలో ఫైట్ లో పాల్గొన్న ఫైటర్ కూడా ఈ క్లైమాక్స్ లో పాల్గొన్నారనీ, ఎన్నో వ్యయప్రయాసలతో చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ అవుతుందనీ తెలిపారు. థాయ్ లాండ్ నుంచి ఇండియా రాగానే ఈనెల 16 నుంచి హైద్రాబాద్ లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నామనీ, సెప్టెంబర్ 15 వరకూ ఏకథాటిగా జరిగే ఈ షెడ్యూల్ లో రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని చెప్పారు. దీంతో షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. సెప్టెంబర్ లో ఆడియో రిలీజ్ చేసి అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూ సూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణుమాదవ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సంగీత, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|