'24 'లో ఇలియానా
ఇలియానా వయసు ఇరవై నాలుగా? లేకుంటే అది సినిమా టైటిలా? ఉద్దేశపూర్వకమో, యాదృచ్ఛికమో తెలీదు కానీ ఇలియానా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తమిళంలో నటిస్తున్న చిత్రానికి '24' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. పనిలో పనిగా ఇలియానా సైతం ఇప్పుడు 24వ పడిలోకి అడగుపెట్టిందట. ఇలియానా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్. కోటి రూపాయల రెమ్యునరేష్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనుకంజ వేయడం లేదు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే కొద్దికాలంగా తమిళంలోకి ఆమెను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమధ్య 'కేడి' అనే తమిళ చిత్రంలో రవికృష్ణకు జోడిగా ఇలియానా నటించింది. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో మళ్లీ అటువైపు ఇలియానా మొగ్గుచూపలేదు. తాజాగా చియాన్ విక్రమ్ తదుపరి చిత్రంలో నటించడానికి ఇలియానా సముఖంగా ఉంది.'మల్లన్న' తర్వాత విక్రమ్ కమిట్ అయిన చిత్రమిది. దీనికే '24' అనే టైటిల్ అనుకుంటున్నారు. '13బి' చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
విక్రమ్ ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో మణిరత్నం నటిస్తున్న 'రావణ్' లో నటిస్తున్నారు. తదుపరి చిత్రంగా సెల్వరాఘవన్ తో ఓ సినిమా చేయాలని విక్రమ్ అనుకున్నప్పటికీ సెల్వ రాఘవన్ వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. దీంతో విక్రమ్ ఎక్కువ గ్యాప్ లేకుండా విక్రమ్ కుమార్ డెరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలియానా సైతం ప్రస్తుతం తనకున్న బిజీ షెడ్యుల్స్ లోనూ విక్రమ్ సినిమాకు డేట్స్ కేటాయించేందుకు సుముఖంగా ఉంది. విక్రమ్ యాక్షన్ ఇమేజ్, ఇలియానా గ్లామర్ తోడైతే బాక్సాఫీస్ షేక్ కాదూ?! .
Be first to comment on this News / Article!
|