ఎన్టీఆర్ జయభేరి...
యంగ్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంలో వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న 'అదుర్స్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటూ డిసెంబర్ రిలీజ్ గా ఉండబోతోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు తీస్తున్న 'బృందావనం' చిత్రానికి కమిట్ అయ్యారు. ఇటీవలే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా మరో కొత్త చిత్రానికి జయభేరి ఆర్ట్స్ అధినేత, సీనియర్ నటుడు మురళీమోహన్ సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల తాజా భోగట్టా. ఆసక్తికరంగా ఈ చిత్రానికి దర్శకుడుగా ఎస్.ఎస్.రాజమౌళిని అనుకుంటున్నారు.
'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత రాజమౌళి డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సునీల్ హీరోగా 'మర్యాద రామన్న' చిత్రాన్ని ఆయన రూపొందించబోతున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా 'విశ్వామిత్ర' చిత్రాన్ని రాజమౌళి నిర్మించాలనే యోచనలో ఉన్నారనీ, దీనికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నారనీ తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రం కూడా రాజమౌళి చేతిలోకి వచ్చింది. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో 'స్టూడెంట్ నెంబర్ వన్', 'సింహాద్రి', 'యమదొంగ' చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ఈ కాంబినేషన్ మళ్లీ పనిచేసే నాలుగో సినిమా వచ్చే ఏడాది ఉంచవచ్చని తెలుస్తోంది. గతంలో పలు బ్లాక్ బస్టర్లు అందించిన జయభేరి సంస్థ చివరి సారిగా మహేష్ తో 'అతడు' చిత్రాన్ని నిర్మించింది.
Be first to comment on this News / Article!
|