గోపీచంద్ 'శంఖం' 11న
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా శ్రీ బాలాజీ సినీ మీడియో పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'శంఖం'. శివ దర్శకుడు. గోపీచంద్ కు జోడిగా త్రిష తొలిసారి ఇందులో నటిస్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవలే ఆడియో విడుదలైంది. దసరా కానుకగా సెప్టెంబర్ 11న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.
రామానాయుడు స్టూడియోస్ లో ప్రస్తుతం మిక్సింగ్, ఎఫెక్ట్స్ వర్క్ శరవేగంగా జరుగుతోందనీ, సెప్టెంబర్ 5వ తేదీకల్లా ఫస్ట్ కాపీ వస్తుందనీ చెప్పారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామనీ వారన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ, బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో సినిమా తీశారనీ, దర్శకుడు శివ ఈ చిత్రాన్ని 'శౌర్యం' కంటే చాలా బాగా తెరకెక్కించారనీ చెప్పారు. తన కెరీర్ లో ఇదో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రలో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, సీత, రజిత, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, విజయ్, సెల్వ, గణేష్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|