నారా వారి 'బాణం' 16న
నందమూరి హీరోల ఆశీస్సులతో నారా వారి కుటుంబం నుంచి వస్తున్న హీరో నారా రోహిత్. నారాచంద్రబాబునాయుడు సోదరుడైన నారా రామ్మూర్తి తనయుడే రోహిత్. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ వైజయంతీ మూవీస్ కు అనుంబంధ సంస్థ త్రీ ఏంజెల్స్ స్టూడియో పతాకంపై శేషు ప్రియాంక చలసాని 'బాణం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
నిర్మాత శేషు ప్రియాంక ఆ విశేషాలను తెలియజేస్తూ, ఇటీవలే సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ, మణిశర్మ సంగీతానికి వనమాలి, రాజజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం కూడా తోడై శ్రోతల ఆదరణ చూరగొంటోందనీ అన్నారు. షూటింగ్ మొత్తంత బొబ్బిలి, విజయనగరం, భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం పొల్లాచ్చి, ఊటీ, అలెప్పీ, పాల్కాడ్ తదితర ప్రాంతాల్లో జరిపామని చెప్పారు. పాటల్లో ఒక ఆంగ్ల పదం కూడా లేకుండా అన్నీ తెలుగు పదాలే వాడటం ఓ విశేషమని చెప్పారు. నారా రోహిత్ కు, తమ బ్యానర్ కు ఇది ప్రిస్టేజియస్ చిత్రంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. రోహిత్ కు జోడిగా వేదిక (విజయదశమి, శివకాశి ఫేమ్) నటిస్తున్న ఈ చిత్రానికి నాగరాజు మాటలు, భూపతి ఆర్ కళాదర్శకత్వం, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|