'ఈనాడు' ట్రెండ్ సెట్టర్: వెంకీ
నేటి సమాజంలో విధ్వంసం పెచ్చరిల్లుతోందనీ, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనే ఇతివృత్తంలో 'ఈనాడు' చిత్రం రూపొందిందనీ హీరో వెంకటేష్ తెలిపారు. కమల్ హాసన్ తో కలిసి వెంకటేష్ నటించిన ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చక్రి తోలేటి దర్శకుడు. హిందీ 'ది వెన్స్ డే' రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో వెంకటేష్ సోమవారంనాడు ఆ విశేషాలను ముచ్చటించారు.
కమల్ తో నటించడం గ్రేట్ ఫీలింగ్..
కమల్ హాసన్ వంటి గ్రేట్ ఆర్టిస్టుతో నటించడం మరపురాని అనుభూతినిచ్చింది. ఆయన నటించిన 'క్షత్రియ పుత్రుడు', 'నాయకుడు', 'స్వాతిముత్యం' పలు చిత్రాలు నన్నెంతో ఆకట్టుకోవడంతో పాటు ఆయన చేసిన పలు పాత్రలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి. 'దశావతారం' చిత్రాన్ని చూసినప్పుడు మనం ఎక్కడున్నామని అనిపించింది. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'ఈనాడు'లో నన్ను నటించమని ఆయన అడిగినప్పుడు చాలా ఆనందం కలిగింది. పాత్ర కూడా నచ్చి సినిమా చేశాను. తమిళంలో కూడా నటిస్తే బాగుంటుందని అనిపించింది. ఇందులో కమల్, నేనూ కలిసి నటించిన సన్నివేశాలు ఒకటి రెండే ఉంటాయి.
కొత్త ట్రెండ్ ఫిల్మ్...
ఇమేజ్ పరంగా ఆలోచించి ఈ సినిమా చేయలేదు. కొత్త ట్రెండ్ కు నాంది పలకాలన్నదే నా ఉద్దేశం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో పోలీస్ కమీషనర్ పాత్ర పోషించాను. నాకూ, ఓ సామాన్య వ్యక్తికీ మధ్య నడిచే కథ ఇది. హాలీవుడ్ సినిమాల్లో చిన్న కథ చుట్టూ సినిమా నడుస్తుంది. అలాగే ఈ చిత్రం ఉంటుంది. అంచనాలతో కాకుండా సినిమాను సినిమాలా చూస్తే తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|