1.45 గంటల నిడివి...
హిందీ 'వెన్స్ డే' చిత్రాన్ని 90 శాతం మంది తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు. కాబట్టి తప్పనిసరిగా వారికి చాలా కొత్తగా ఈ సినిమా ఉంటుంది. మొత్తం 35 రోజుల షూటింగ్ తో సినిమా పూర్తయింది. నేను 15 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాను. సినిమా నిడివి 1.45 గంటలు ఉంటుంది. కమల్ కుమార్తె శ్రుతిహాసన్ చక్కటి పాటలు అందించారు. రీరికార్డింగ్ చాలా బాగా వచ్చింది. లొకేషన్ లోనే ఆన్ లైన్ ఎడిటింగ్ చేశారు. అలాగే పూర్తి సినిమా రెడ్ వన్ కెమెరాతో చిత్రీకరించారు.
హిందీలో చేస్తున్నా...
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఓం నమో వెంకటేశ' చిత్రంలో వైవిధ్యభరితమైన వినోదాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తయింది. ఈనెల 11 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభమై సినిమా పూర్తయ్యేంతవరకూ కొనసాగుతుంది. అలాగే 'గంగ' అనే మరో చిత్రానికి కమిట్ అయ్యారు. ఓ యాక్షన్ సినిమాతో పాటు హిందీలో కూడా ఓ సినిమా చేయబోతున్నాను.