పూరీ 'బంపర్ ఆఫర్' 25న
సాయిరామ్ శంకర్ హీరోగా వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న చిత్రం 'బంపర్ ఆఫర్'. జయరవీంద్ర దర్శకుడు. బ్యాంకాక్ లో ఇటీవల చిత్రించిన రెండు పాటలతో షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం ఆడియో ఈనెల 11న విడుదల చేస్తున్నట్టు ఎగ్జిక్యూటర్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ తెలియజేశారు.
పూరీ జగన్నాథ్ ఏర్పాటు చేసిన పూరీ సంగీత్ ఆడియో కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలవుతోందనీ, పూరీ కంపెనీ నుంచి రిలీజ్ అవుతున్న తొలి ఆడియో ఇదే కావడం విశేషమనీ చెప్పారు. గాయకుడు రఘు కుంచె ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడయ్యారని చెప్పారు. సాయిరామ్ శంకర్ సరనన బిందుమాధవి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) హీరోయిన్ గా నటిస్తోందని చెప్పారు. వైష్ణో అకాడమీ బ్యానర్ కు ఇది మరో హిట్ చిత్రమవుతుందనీ, ఈనెల 25న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, కోవై సరళ, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు పూరీ జగన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కర భట్ల పాటలు, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|