నితిన్ 'రెచ్చిపో' 25న
నితిన్, ఇలియానా తొలిసారి జంటగా నటించిన 'రెచ్చిపో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ (న్యూజెర్సీ) ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఈనెల 10న నేరుగా మార్కెట్ లోకి విడుదలవుతోంది.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఆడియో ఫంక్షన్ నిర్వహించడం లేదనీ, సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు. సినిమా రిలీజ్ కు ముందు డిస్క్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. యాక్షన్ తో కూడిన యూత్ ఫుల్ రొమాంటింక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిందనీ, నితిన్ బాడీలాంగ్వేజ్, స్టయిల్, ఇలియానా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు నిలుస్తాయని దర్శకుడు పరుచూరి మురళి తెలిపారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు యూత్ ఫుల్ గా అందర్నీ అలరిస్తాయని చెప్పారు. దసరా కానుకగా ఈనెల 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని సుప్రీం మూవీస్ తో కలిసి నిర్మాత వెంకట రమణ ఓవర్ సీస్ ల 9 ప్రింట్లతో 9 ప్రధాన కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని ప్రింట్లతో నితిన్ సినిమా ఓవర్ సీస్ లో విడుదలవుతుండటం ఇదే ప్రథమం.
Be first to comment on this News / Article!
|