ఉదయ్ నోట చిరు పాట!
హీరో ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఒకానొక సంఘటన ఆయన కెరీర్ మసకబారడానికి కారణమైందనే ప్రచారం పరిశ్రమలో ఉన్నదే. అయితే ఇప్పుడు అది గతం. తనకు ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకునే ఉదయ్ కిరణ్ ఇప్పటికీ ఆయన ప్రస్తావన రాగానే నవ్వుతూనే ఆయనంటే గౌరవమని చెబుతారు. ఆసక్తికరంగా ఇప్పుడు చిరంజీవి నటించిన ఓ పాపులర్ సాంగ్ ను ఉదయ్ కిరణ్ మీద రీమిక్స్ చేసి తీయబోతున్నారని సమాచారం.
కొద్దికాలంగా సరైన హిట్లు లేని ఉదయ్ కిరణ్ తాజాగా శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. సుభా సెల్వం దర్శకుడు. ప్రదీప్ కోనేరు సంగీతం అందిస్తున్నారు. ఉదయ్ కిరణ్ కు జోడిగా శ్వేతబసు ప్రసాద్ ( 'కొత్త బంగారులోకం', 'రైడ్' ఫేమ్) నటిస్తోంది. ఈ చిత్రంలో ఉదయ్-శ్వేత పై 'ఇది ఒక నందనవనము...' అనే రీమిక్స్ సాంగ్ ను దర్శకుడు సుభా సెల్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇది చిరంజీవి-రాధ జంటగా కె.రాఘువేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అడవి దొంగ' చిత్రంలోని పాపులర్ హిట్ సాంగ్. దీనిని చక్రవర్తి స్వరపరచారు. ఇటీవల కాలంలో రీమిక్స్ సాంగ్ లకు ఆదరణ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో 'ఇది ఒక నందనవనం' పాటను రీమిక్స్ చేయాలని దర్శకుడు ప్రపోజ్ చేశారనీ, ఉదయ్ సైతం ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేశారనీ తెలుస్తోంది. ఈ పాటకు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే...
Be first to comment on this News / Article!
|