'క్విక్ గన్ మురుగన్' 25న
హాస్య నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా రూపొందిన ఆంగ్ల చిత్రం 'క్విక్ గన్ మురుగన్'. ఇటీవల ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంది.ఫ్యాట్ ఫిష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించారు. గుర్రం గౌతమ్ కుమార్ సమర్పణలో తెలుగు వెర్షన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు ప్రేక్షకులను రెండున్నర దశాబ్దాలకు పైగా అలరిస్తున్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ తొలిసారి కౌబాయ్ పాత్రలో నటించిన చిత్రమిదనీ, ప్రపంచానికి ఉపయోగపడే పని చేయాలన్నదే ఈ కౌబాయ్ ఆశయమనీ గుర్రం గౌతమ్ కుమార్ తెలిపారు. శాఖాహారం ఆరోగ్యానికి మంచిదని ప్రపంచానికి చాటి చెప్పాలని 'క్విక్ గన్ మురుగన్' ఆశయమనీ, ఓ రెస్టారెంట్ ఓనర్ అతని పాలిట విలన్ గా మారుతాడనీ, ఆ తర్వాత జరిగే పరిణామాలు చక్కటి వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందిస్తాయనీ తెలిపారు. టైటిల్ పాత్రను రాజేంద్రప్రసాద్ పోషించగా, విలనీ పాత్రను నాజర్, రాజేంద్ర ప్రసాద్ ను ఇష్టపడే మాంగో డాలీ పాత్రను రంభ పోషించారనీ చెప్పారు. ఈ చిత్రానికి డేనియర్ జార్జ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|