అక్టోబర్ 2న 'నిన్ను కలిశాక'
కొత్త తారాగణంతో 'నచ్చావులే' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని ఇటీవల ప్రేక్షకులకు అందించిన ఉషాకిరణ్ మూవీస్ సంస్థ తాజాగా మరో టీనేజ్ ఎంటర్ టైనర్ గా 'నిన్ను కలిశాక' చిత్రాన్ని రూపొందించింది. ఈ బ్యానర్ నుంచి వస్తున్న 83వ చిత్రమిది. రామోజీ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకుడు. సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషా అనే నలుగురు కొత్త హీరోహీరోయిన్లు ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.
కొత్త నటీనటులతో యూత్ ఫుల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందిందనీ, ఉషాకిరణ్ సంస్థకు ఇది మరో మంచి సక్సెస్ ఫిల్మ్ అవుతుందని శివనాగేశ్వరరావు చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణుడు (వినాయకుడు ఫేమ్), తరుణ్ మాస్టర్, ఎంఎస్ నారాయణ, వినయ్ వర్మ, సందీప్, రవిశంకర్, సునీల్ కపూర్, జోగినాయుడు, సుభాషిణి, సరస్వతి ప్రదీప్, ఇందిర, అనిత, మాస్టర్ శివవర్మ, మాస్టర్ భరత్ తదిరులు నటించారు. లక్ష్మీభూపాల్ మాటలు, అనంత్ శ్రీరామ్-వనమాలి-లక్ష్మీభూపాల్ పాటలు, బి.ఎల్.సంజయ్ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|