'బంపర్ ఆఫర్' 9న
సాయిరాం శంకర్ కథానాయకుడుగా వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న 'బంపర్ ఆఫర్' చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ అక్టోబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ద్వారా జయరవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయిరాం శంకర్ జోడిగా బిందుమాధవి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా గాయకుడు కుంచె రఘు తొలిసారి సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల పూరీ జగన్నాథ్ సొంత ఆడియో సంస్థ పూరీ సంగీత్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలై శ్రోతలను అలరిస్తోంది.
'బంపర్ ఆఫర్' ఆడియో ఇన్ స్టంట్ హిట్ అయిందనీ, ముఖ్యంగా 'రావణమ్మ..' పాట శ్రోతలను ఉర్రూతలూగిస్తూ ఆడియో చార్ట్స్ లో నెంబర్ వన్ గా నిలుస్తోందనీ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్ గణేష్ తెలిపారు. అన్ని ఏరియాల నుంచి రిపీట్ ఆర్డర్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బంపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. సాయిరాం శంకర్ గెటప్, నటన చాలా కొత్తగా, ఎనర్జిటిక్ గా ఉంటుందనీ, బింధుమాధవి గ్లామర్ తో కూడిన పెర్ ఫారమెన్స్ ప్రదర్శించిందనీ చెప్పారు. ఈనెల 9న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, కోవై సరళ, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు పూరీ జగన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కర భట్ల పాటలు, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|