23న వస్తున్న 'జయీభవ'
'అతనొక్కడే', 'హరేరామ్' వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'జయీభవ'. నరేష్ కొండేపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 23 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు కల్యాణ్ రామ్ తెలిపారు.
థమన్ ఎస్. ఈ చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారనీ, ఇప్పటికే విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందనీ ఆయన చెప్పారు. ఆడియో హిట్టయినట్టే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయనీ, ఈనెల 23న సినిమా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నామనీ చెప్పారు. కల్యాణ్ రామ్ కు జోడిగా హన్సిక మోత్వాని నటిస్తున్న ఈ చిత్రంలో ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానదం, ఆలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ, బెనర్జీ, వకీల్ ఖాన్ ఇతర పాత్రలు పోషించారు. బి.వి.ఎస్.రవి కథ-మాటలు అందించిన ఈ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, రాజీవ్ నాయర్ ఆర్ట్, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు, మాస్టర్ నందమూరి శౌర్యారామ్ సమర్పకుడుగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|