అల్లు శిరీష్ టీవీ ఛానెల్
క్రియేటివిటీకి హద్దులు ఉండవని నిరూపించుకునేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నారు. ఇటీవల కాలంలో గీతా ఆర్ట్స్ సినిమాల మార్కెటింగ్, ప్రమోషన్ వర్క్ చూసుకుంటూ వచ్చిన అల్లు శిరీష్ ఇప్పుడు వినూత్న వ్యాపార శైలిలో దూసుకుపోతున్నారు. దక్షిణాది భాషా చిత్రాల వివరాలను ఒకే చోట తెలుసుకునేందుకు వీలుగా ఆంగ్లంలో తొలి దక్షిణాది సినీ మ్యాగజైన్ 'సౌత్ స్కోప్'ను ఆయన ఇటీవల చెన్నైలోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రముఖుల చేత ఆవిష్కరించారు. తొలి సంచిక కూడా మార్కెట్ లో విడుదలైన తరుణంలో అనూహ్యంగా 'సినీ స్కోప్ స్టైల్' పేరిట తొలి వార్షిక ఆవార్డులను కూడా ప్రకటించి సంచలనం రేపారు. నాలుగు దక్షిణాది భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ఈ నెలలోనే ప్రదానం చేయబోతున్నారు. తాజాగా ఆయన ఓ టీవీ ఛానెల్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాల ద్వారా తెలిసింది.
తెలుగులో పోటాపోటీ ఛానెల్స్ ఉన్నప్పటికీ తన ఛానెల్ కు ప్రత్యేకత ఉండేలా అల్లు శిరీష్ ప్లాన్ చేస్తున్నారట. దక్షిణాది భాషల సమాచారంతో 'సౌత్ స్కోప్' మ్యాగజైన్ ఏర్పాటు చేసిన విధంగానే ఈ నాలుగు భాషల చిత్రాలు ప్రదర్శించే తొలి దక్షిణాది సినీ ఛానెల్ గా దీనిని తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తోంది. ఐడియా వినూత్నంగానే ఉంది మరి...
Be first to comment on this News / Article!
|